Medak: మెదక్ జిల్లాలో దారుణం.. మైనర్ బాలికపై కామాంధుడి అత్యాచారం.. ఇంటికి తీసుకెళ్లి బంధించి..

Medak: మెదక్ జిల్లా పాల్వంచలో ఘాతుకం చోటుచేసుకుంది. ఓ ప్రబుద్ధుడు.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాల్వంచ గ్రామానికి చెందిన బనయ్య అనే వ్యక్తి.. ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. అయితే విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు.. గ్రామ పెద్ద సమక్షంలో పంచాయతీ పెట్టగా.. మరోసారి బాలిక వైపు కన్నెత్తి చూడనని ఒప్పుకున్నాడు. కానీ బుద్ధి మాత్రం మార్చుకోలేదు. మరోసారి ఘాతుకానికి తెగబడ్డాడు.
బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఆమెను తన ఇంటికి రావాలని అడిగాడు. అయితే అమె ఒప్పుకోకపోవడంతో.. పురుగుల మందు తాగేస్తానని బెదిరించి.. తన ఇంటికి తీసుకెళ్లి బంధించాడు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు.. పోలీసులను ఆశ్రయించడంతో.. బాలికను సురక్షితంగా కాపాడి.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు బనయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే బనయ్యకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయని పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com