పెళ్ళైన రెండు నెలలకే.. భార్యను చంపిన భర్త

పెళ్ళైన రెండు నెలలకే.. భార్యను చంపిన భర్త
కర్నూలు జిల్లా బాపురంలో దారుణం జరిగింది. భార్య, అత్తపై దాడి చేసి హతమార్చాడు రమేష్‌ అనే వ్యక్తి

కర్నూలు జిల్లా బాపురంలో దారుణం జరిగింది. భార్య, అత్తపై దాడి చేసి హతమార్చాడు రమేష్‌ అనే వ్యక్తి. రెండు నెలల క్రితమే రమేష్‌, మహాదేవికి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. రమేష్‌ది కర్నాటకలోని టెక్కలికోట. ఇక మహాదేవి బాపురంలో వాలంటీర్‌గా పని చేస్తుండగా ఆమె తల్లి హనుమంతమ్మ.. తలారిగా పని చేస్తున్నారు. అయితే వివాహం అనంతరం టెక్కలి కోటకు రావాలని రమేష్ భార్యను కోరాడు. అయితే ఉద్యోగం చేస్తుండటంతో ఇక్కడే ఉందామని మహాదేవి భర్తకు చెప్పింది. ఇదే విషయంలో భార్య, అత్తతో రమేష్‌కు తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే కోపంతో ఇద్దరిపై రమేష్‌ దాడి చేశారు. ఈ దాడిలో మహాదేవి, హనుమంతమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక నిందితుడు రమేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story