ప్రియురాలి షాపింగ్‌ కోసం కారు విడిభాగాలను దొంగిలించిన వ్యక్తి

ప్రియురాలి షాపింగ్‌ కోసం కారు విడిభాగాలను దొంగిలించిన వ్యక్తి
తన ప్రియురాలి షాపింగ్ కోసం ఓ యువకుడు కారు విడిభాగాలను దొంగిలించిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది.

తన ప్రియురాలి షాపింగ్ కోసం ఓ యువకుడు కారు విడిభాగాలను దొంగిలించిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. అతను గత ఏడాది కాలంగా పార్క్ చేసిన కార్ల నుండి ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్స్ మరియు ఇంజెక్టర్లను దొంగిలించేవాడు. దాంతో ప్రియురాలికి కావలసినవన్నీ కొనిపెట్టేవాడు. కానీ అతడి ఆటలు ఎంతో కాలం సాగలేదు. ఓ ఫైన్ డే పోలీసులకు పట్టుబడ్డాడు.

నిందితుడిని మలాద్ ఈస్ట్‌లోని కురార్ గ్రామానికి చెందిన మొహ్సిన్ మెహబూబ్ షేక్‌గా గుర్తించారు. అతని కార్యకలాపాలపై అనుమానం రావడంతో, పోలీసులు అతన్ని కొన్ని నెలలుగా ట్రాక్ చేసి ఇటీవల అరెస్టు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు నలుగురు అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం యువకుడిని గుర్తించడానికి స్థానికంగా మరియు ఇతర ప్రాంతాల్లోని 50కి పైగా సీసీటీవీలను స్కాన్ చేసి చివరకు పట్టుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story