Gudiwada : బాలుడిని లోబర్చుకున్న వివాహిత.. గుడివాడ నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్..

Gudiwada : సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భర్త, నలుగురు పిల్లలు ఉన్న ఓ వివాహిత.. బాలుడిని కిడ్నాప్ చేసి సహజీవనం చేసింది. చివరికి కటకటాలపాలైంది. కృష్ణా జిల్లా గుడివాడలో నివసిస్తున్న మహిళ తన ఎదురింట్లో ఉండే 14 ఏళ్ల బాలుడికి ఆకర్షితురాలైంది. మాయమాయలు చెప్పి శారీరకంగా లోబర్చుకుంది. ఇది గమనించిన బాలుడి తల్లిదండ్రులు.. ఆమె ఇంటికి వెళ్లొద్దని మందలించారు.
ఈ విషయం తెలుసుకున్న ఆ వివాహిత.. ఆ అబ్బాయి తనకెక్కడ దూరం అవుతాడోనని ఎస్కేప్ ప్లాన్ వేసింది.ఈనెల 19న హైదరాబాద్ బాలానగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని బాలుడితో సహజీవనం చేస్తోంది. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత బాలుడు గుడివాడలోని తన ఇంటికి వెళ్లాలని భావించాడు. తన వద్ద డబ్బులు లేవని.. స్పందించి డబ్బులు పంపాలని స్నేహితులు, చుట్టు పక్కల వారికి ఫోన్‌లో మెస్సేజ్ పెట్టాడు.
ఎవరూ స్పందించకపోవడంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను హైదరాబాద్‌లో ఉన్నానని, ఇంటికి వస్తానని చెప్పాడు. అప్పటికే జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు గుడివాడ టూటౌన్ స్టేషన్ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు ఏపీలోని వివిధ జిల్లాల్లో బాలుడి కోసం గాలింపు చేపట్టాయి.
ఓ బృందం బాలుడు మాట్లాడుతున్న సెల్‌ఫోన్ లొకేషన్ గుర్తించి.. వారున్న ఇంటికి వెళ్లారు. బాలానగర్‌లో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని గుడివాడ తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. వివాహితపై కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com