Bihar: బిహార్‌లో దారుణం.. బస్సులోనే మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..

Bihar: బిహార్ బేతియా జిల్లాలో దారుణం జరిగింది. బస్సులోనే ఓ మైనర్‌పై లైంగిక దాడి జరిగింది. బస్సు డ్రైవర్, కండక్టర్, హెల్పర్ కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బస్సు పాట్నాకు వెళ్తుందని చెప్పి బాలికను ఎక్కించుకున్నాడు డ్రైవర్. కండక్టర్, హెల్పర్‌తో కలిసి బస్టాండ్ నుంచి బయల్దేరారు. బైపాస్ రోడ్డు వద్ద బస్సు ఆపి.. బాలికకు డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించారు. బాలిక స్పృహతప్పి పడిపోగానే.. నిందితులు ఆమెపై బస్సులో సామూహిక అత్యాచారం చేశాడు.
అనంతరం బస్సును లాక్ చేసి డ్రైవర్ పారిపోయాడు. బాలిక స్పృహలోకి రాగానే బస్సు తలుపులను గట్టిగా కొట్టింది. దారిన వెళ్లేవారు గమనించి డోర్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలికను రక్షించి వైద్య పరీక్షల కోసం తరలించారు. ఈ ఘటనపై బాలిక నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. బస్సును సీజ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com