Hyderabad Murder : స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం... చివరికి ?

Hyderabad Murder : స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం... చివరికి ?
X
Hyderabad Murder : అక్రమ సంబంధం స్నేహితుడి ప్రాణాలను తీసింది. ఈ ఘటన హైదరాబాద్‌ కూకట్‌‌‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

Hyderabad Murder : అక్రమ సంబంధం స్నేహితుడి ప్రాణాలను తీసింది. ఈ ఘటన హైదరాబాద్‌ కూకట్‌‌‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో స్నేహితుడిని కడతేర్చాడు పాలవ్యాపారి. కూకట్‌ పల్లి ఖైత్లాపూర్‌‌‌లో నివసించే శ్రీకాంత్‌... ఈనెల ఒకటిన తన స్నేహితుడు శ్రీశైలంతో కలిసి బయటకు వెళ్లాడు. అప్పటినుండి శ్రీకాంత్‌ తిరిగి ఇంటికి రాకవపోడంతో అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో శ్రీశైలంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో ఐడీఎల్‌ కంపెనీకి చెందిన నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతనిచ్చిన సమాచారంతో హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లిన పోలీసులు... మృతదేహాన్ని గుర్తించి పోస్ట్‌ మార్టమ్‌ కు తరలించారు. ఈనెల ఒకటిన మిస్సింగ్‌ కేసు నమోదు చేశామని, హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టామని సిఐ నర్సింగ్‌ రావు తెలిపారు.

Tags

Next Story