శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన.. అప్పుడే పుట్టిన పసికందును..

X
శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ల పొదల్లో పడేశారు. నరసన్నపేట నియోజకవర్గంలోని గుండువలస గ్రామానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయాన్న అటువైపుగా వెళ్తున్న వాకర్స్‌కు పసికందు ఏడుపు వినిపించడంతో.. చిన్నారిని కాపాడి నరసన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పాపకు ప్రాధమిక చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న చైల్డ్ లైన్ సిబ్బంది.. పసికందును రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
