Britain: హవ్వా.. రోగితో నర్స్ రాసలీలలు, పేషెంట్ మృతి

Britain: హవ్వా.. రోగితో నర్స్ రాసలీలలు, పేషెంట్ మృతి

బ్రిటన్‌లోని వేల్స్‌లో విస్తుపోయే సంఘటన చోటు చేసుకుంది. నర్స్‌తో కామ రాత్రిలో గడపాలనుకున్న వ్యక్తికి కాళ రాత్రి ఎదురయ్యింది. 28ఏళ్ల ఓ నర్స్ తన పేషెంట్‌తో శృంగారంలో పాల్గొంది. అసలు కథ ఏంటంటే వారు శృంగారంలో ఉండగానే సదరు వ్యక్తి మరణించాడు. పేషెంట్‌తో ఈ రాసలీలలు నెరిపి, నర్సింగ్ వృత్తికి కళంకం తెచ్చిందని హాస్పిటల్ యాజమాన్యం ఆమెని వెంటనే విధుల్లో నుంచి తొలగించమే కాకుండా పోలీసులకు అప్పగించారు.

మరణించిన వ్యక్తి ఆ హాస్పిటల్‌లో డయాలసిస్ చికిత్సకు తరచుగా వస్తుండటంతో పెనలోప్ విలియమ్స్ అనే నర్స్‌తో సంబంధం ఏర్పడింది. ఓ రోజు రాత్రి పార్కింగ్ స్థలంలో కారు వెనక సీట్‌లో వీరు రాసక్రీడల్లో మునిగి తేలుతుండగా, హఠాత్తుగా సదరు వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో ఆ నర్స్ అంబులెన్స్‌కి ఫోన్ చేయకుండా తన సహోద్యోగికి చెప్పింది. వారు కూడా అంబులెన్స్‌కి ఫోన్ చేయమన్నా తను పెడచెవిన పెట్టింది. తర్వాత వచ్చిన వైద్యసిబ్బంది బట్టలు లేకుండా ఉన్న ఆ వ్యక్తిని చూసి విస్తుపోయారు.

అంతే కాకుండా పోలీసులకు, మరణించిన వ్యక్తే ముందుగా తనకు ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ చేసి, తన ఆరోగ్య స్థితిపై చర్చిద్దామని అనడంతోనే కలిశానని అబద్ధం చెప్పింది. కారులో 30-45 నిమిషాల పాటు కేవలం మాట్లాడుకున్నామని బుకాయించింది. పోలీసులకు అనుమానం వచ్చి నిలదీయడంతో సంవత్సరం పాటు వారి మధ్య జరుగుతున్న అక్రమ సంబంధాన్ని బయటపెట్టడంతో పాటు శృంగారం చేసే సమయంలోనే మరణించాడని ఒప్పుకుంది. దీర్ఘకాల మూత్రపిండాల సమస్య, హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతోనే ఆ వ్యక్తి మరణించాడని మెడికల్ రిపోర్ట్ ధృవీకరించింది.

బాధ్యతాయుతమైన, గౌరవప్రదమైన నర్సింగ్ వృత్తిలో ఉంటూ ఈ పాడు పని చేసినందుకు హాస్పిటల్ వారు ఆమెని ఉద్యోగం నుంచి తొలగించారు.

"విలియమ్స్ చర్యలు ఒక రిజిస్టర్డ్ నర్స్ ప్రమాణాలకు దూరంగా ఉన్నాయి. తనను ఈ వృత్తిలో కొనసాగిస్తే ఈ వృత్తి పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం పోతుంది" అని హాస్పిటల్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story