ఒక్క ముద్దిస్తే రూ.25 వేలిస్తా.. ఆర్‌ఎంపీ వైద్యురాలిపై..

ఒక్క ముద్దిస్తే రూ.25 వేలిస్తా.. ఆర్‌ఎంపీ వైద్యురాలిపై..
X
ప్రతి రోజూ ఏదో ఒక మూల ఎక్కడో ఒక చోట మహిళ వేధింపులకు గురికావలసిందే.. మగాడి కామదాహానికి బలికావలసిందే..

సిగ్గూ, శరం, ఆత్మాభిమానం, సమాజం ఏమనుకుంటుందో అన్న ఆలోచన ఏవీ పట్టట్లేదు.. తనకు కావలసింది దక్కితే చాలు.. ఎంతటి నీచానికైనా ఒడిగడుతున్నారు. సమాజం సిగ్గుతో తలవంచుకునేలా ప్రవర్తిస్తున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక మూల ఎక్కడో ఒక చోట మహిళ వేధింపులకు గురికావలసిందే.. మగాడి కామదాహానికి బలికావలసిందే.. తాజాగా ఓ దళిత ఆర్‌ఎంపీ వైద్యురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి.. ఆమె కంప్లైంట్‌తో పోలీసులు సత్వరమే స్పందించి అతడిపై నిర్భయ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దళిత మహిళ ఆర్‌ఎంపీగా స్థానికంగా క్లినిక్ నడుపుతున్నారు. అదే గ్రామానికి చెందిన పాటి ప్రసాద్ రెడ్డి వారం క్రితం ఆరోగ్య సమస్యల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు.. అనంతరం ఆమె సెల్ నెంబర్ తీసుకుని కాల్ చేయడం, మెస్పేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. ఆమె వాటికి రెస్పాండ్ కాకపోవడంతో ఈనెల 17న మధ్యాహ్నం క్లినిక్‌కు వెళ్లాడు. నువ్వంటే నాకు ఇష్టం.. నిన్ను ప్రేమిస్తున్నా.. ఒక్క ముద్దిస్తే రూ.25 వేలు ఇస్తా,, 5 నెలల పాటు క్లినిక్‌కి కిరాయి కడతా అని వేధించడం ప్రారంభించాడు.

అతడి నిర్వాకాన్ని అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులకు చెప్పగా వారు ఇంటికి వెళ్లే సరికి పరారయ్యాడు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా ప్రసాద్ రెడ్డిపై నిర్భయ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పట్టుకోవడానికి పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

Tags

Next Story