Rajasthan Alwar: దివ్యాంగ బాలికపై అత్యాచారం.. అనంతరం హైవేపై వదిలేసి..

Rajasthan Alwar: రాజస్థాన్ అల్వార్‌లో దారుణం జరిగింది. స్థానిక తిజారా ఫ్లైవర్‌పై అపస్మారక స్థితిలో ఓ దివ్యాంగ బాలికను గుర్తించారు పోలీసులు. బాలికకు తీవ్ర రక్తస్రావం జరిగినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు.
మంగళవారం రాత్రి 8 గంటల టైంలో అటు వైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి.. ఫ్లైఓవర్ పై అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించి తమకు సమాచారం అందించాడన్నారు పోలీసులు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. బాలికను హాస్పిటల్‌కు తరలించామని చెప్పారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించామన్నారు. బాలిక మాట్లాడలేకపోతుందని చెప్పారు. తల్లిదండ్రులను ఆరా తీయగా..మంగళవారం మధ్యాహ్నాం నుంచి కనిపించకుండాపోయిందని చెప్పారన్నారు.
కేసులో విచారణ వేగవంతం చేసినట్లు చెప్పారు. దోషులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు చెప్పారు. డాగ్ స్క్వాడ్, ఫొరెన్సిక్ సైన్స్ టీంలు కూడా దర్యాప్తులో భాగమయ్యాయని చెప్పారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com