ప్రియురాలిని చంపి మ్యాన్ హోల్ లో పడేసిన పూజారి

వివాహేతర సంబంధాలు హత్యకు దారితీస్తున్నాయి. పెళ్లై భార్యా పిల్లలు ఉన్నా మరో మహిళతో అక్రమసంబంధం నడపడం ఆపై ఆమె పెళ్లిచేసుకోమనడంతో కర్కశంగా హత్యచేస్తున్నారు కొందరు. తాజాగా ఓ గుడి పూజారి వివాహేతర సంబంధం నడుపుతున్న మహిళను హత్య చేసి మృతదేహాన్ని మ్యాన్ హోల్ లో పడేశాడు. ఈ ఘటన హైదరాబాద్ శంషాబాద్ లో జరిగింది. వెంకట సాయి సూర్య కృష్ణ అనే వ్యక్తి ఓ గుడిలో పంతులుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా... అప్సర అనే మహిళతో వివాహేతర సంబంధం నడిపాడు. కొంతకాలంగా పెళ్లిచేసుకోమని సూర్య కృష్ణను అప్సర కోరుతూ వచ్చింది. దీంతో ఆమెను హత్య చేశాడు. ఆపై అప్సర తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అప్సరకు తాను మేనమామను అవుతానని పోలీసులకు చెప్పాడు. ఈనెల 3 న అప్సర తన స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్తానంటే తానే కారులో శంషాబాద్ అంబేడ్కర్ విగ్రహం వద్ద డ్రాప్ చేశానని ఫిర్యాదులో రాశాడు. విచారణ చేపట్టిన పోలీసులకు పంతులుపై అనుమానం కలిగింది. సూర్య కృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
జూన్ 3న అప్సరను సూర్య కృష్ణ హత్య చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. శంషాబాద్ సుల్తాన్ పల్లిలో అప్సరను హత్య చేసి మృతదేహాన్ని సరూర్ నగర్ మ్యాన్ హోల్ లో పడేసినట్లు తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. అప్సరను శంషాబాద్ కు తీసుకెళ్లి నర్కుడ వద్ద తలపై రాయితో మోది హత్య చేసినట్లు చెప్పారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కారులో తరలించి సరూనగర్ మ్యాన్ హోల్ లో పడవేశాడు. పూజారికి ఇదివరకే ఇద్దరు పిల్లలు భార్య ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com