Rangareddy District: రెండో పెళ్లికి సిద్ధమయిన రైల్వే ఉద్యోగి.. ఇంతలోనే సూసైడ్..

Rangareddy District: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో రైల్వేఉద్యోగి సూసైడ్ స్థానికంగా సంచలనం రేకిత్తించింది. గుంతకల్ రైల్వేస్టేషన్‌లో డిప్యూటీ స్టేషన్ మేనేజర్‌గా విజయ్‌కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా గుడిమల్కాపూర్‌కు చెందిన యువతితో ప్రేమలోపడ్డ విజయకుమార్.. ఆమెతో కలిసి ఉప్పర్‌పల్లిలో సహజీవనం సాగిస్తున్నాడు. ఇదివరకే విజయ్‌కుమార్‌కు భార్యతోపాటు ఇద్దరు పిల్లలున్నారు.
అయితే యువతిని రెండోపెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిన ఆయన.. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరో రెండురోజుల్లో పెళ్లి జరగనుండగా.. అకస్మత్తుగా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. సూసైడ్‌పై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు పంపించారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com