Axis Bank : ఏటీఎం చోరీకి విఫలయత్నం.. పోలీసులకు చిక్కి కటకటాలపాలు..!

X
By - TV5 Digital Team |16 Nov 2021 8:45 AM IST
Axis Bank : హైదరాబాద్ శివార్లలో ఓ దొంగ బీభత్సం సృష్టించాడు. ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశాడు.
Axis bank : హైదరాబాద్ శివార్లలో ఓ దొంగ బీభత్సం సృష్టించాడు. ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడ ఆరె మైసమ్మ వద్ద ఉన్న.. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో అర్ధరాత్రి చోరీకి ప్రయత్నించాడు ఓ దొంగ. ఏటీఎం తెరిచే క్రమంలో సైరన్ మోగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు వెళ్లారు. అక్కడే ఉన్న నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com