గుళ్ళో దొంగతనం... చోరీ చేయడానికి ముందు అమ్మవారికి దండం..!

X
By - /TV5 Digital Team |4 Nov 2021 2:00 PM IST
Khammam : ఖమ్మంలోని ఓ గుడిలో జరిగిన దొంగతానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Khammam : ఖమ్మంలోని ఓ గుడిలో జరిగిన దొంగతానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 4వ డివిజన్‌లో ఉన్న అంకమ్మ ఆలయంలో ఈ మధ్యే చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించి హుండీని పగులగొట్టి అందులో ఉన్న నగదు ఎత్తుకెళ్లాడు ఓ దొంగ. అయితే.. చోరీ చేయడానికి ముందు ఆ దొంగ అమ్మవారికి దండం పెట్టాడు. ఆ తర్వాత హుండీని పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లాడు. ఇదంతా కూడా సీసీ టీవీలో రికార్డయింది. దీని ఆధారంగా దేవస్థానం కమిటీ అధ్యక్షుడు కొమ్ము భాస్కర్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com