Khammam: వివాహితపై టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ లైంగిక వేధింపులు..

Khammam: వివాహితపై టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ లైంగిక వేధింపులు..
Khammam: ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌.. ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Khammam: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేద్కర్‌ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌.. ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీన్ని ప్రశ్నించిన గ్రామస్తులపై సర్పంచ్‌ కిరణ్‌బాబు కర్రలతో వీరంగం చేశాడు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని అదే గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ వార్డు మెంబర్‌ అయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సర్పంచ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తల్లాడ ఎస్సై సురేష్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story