Suryapeta : భర్త వివాహేతర సంబంధం... రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసిన భార్య
Suryapeta : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో.. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. గోపాలపురం కాలనీకి చెందిన రవి కుమార్‌కు కోకిల అనే మహిళతో ఆరు సంవత్సరాల క్రితం వివాహం కాగా.. వీరికి ఓ పాప కూడా ఉంది. భార్యాభర్తల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు రావడంతో.. వారిద్దరూ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ జీడిమెట్ల ఏరియాకు చెందిన ప్రశాంతితో రవికి పరిచయం ఏర్పడింది. భార్యకు విడాకులు ఇచ్చానని చెప్పి.. ప్రశాంతితో రవి సంబంధం పెట్టుకున్నాడు. సూర్యాపేట పట్టణంలోని బాలాజీనగర్‌లో ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న భార్య కోకిల.. తల్లిదండ్రులు, బంధువులతో వచ్చి భర్తను రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. పోలీసులకు అప్పగించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com