గాఢంగా ప్రేమ.. దారుణంగా మోసం.. అయినప్పటికీ భార్యే కావాలంటున్న భర్త..!

గాఢంగా ప్రేమ.. దారుణంగా మోసం.. అయినప్పటికీ భార్యే కావాలంటున్న భర్త..!
ఆమె గాఢంగా ప్రేమిస్తున్నట్టుగా నటిస్తుంది. ఆమె ప్రేమకి తమ కుటుంబాలను సైతం వదిలేసి వస్తారు యువకులు.

ఆమె గాఢంగా ప్రేమిస్తున్నట్టుగా నటిస్తుంది. ఆమె ప్రేమకి తమ కుటుంబాలను సైతం వదిలేసి వస్తారు యువకులు. ఆకర్షణీయంగా కనిపించి యువకులను బుట్టలో వేసుకొని, పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత వారినుంచి అంతా దోచుకొని మాయవ్వడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య. అలాగే ఓ యువకుడు ఆ యువతి చూపించేది నిజమైన ప్రేమ అనుకోని దారుణంగా మోసపోయాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని బాబుపూర్వకు చెందిన అమిత్‌‌‌‌శర్మ, గోవింద్‌నగర్‌లో నివసించే రుచివర్మను ప్రేమించాడు. ఆమె కూడా ఇతన్ని ప్రేమించింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. పెద్దల అంగీకారంతో ఆర్యసమాజ్‌‌‌లో పెళ్లి చేసుకున్నారు. మొదటి లాక్‌‌‌‌‌డౌన్ టైంలో జరిగిన పెళ్లి కావడంతో ఆ పెళ్లికి ఎవరినీ పిలవలేకపోయారు. ఇరు కుటుంబాల నుంచి పది మంది మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత కొన్నిరోజులు వీరిద్దరి కాపురం సాఫీగా సాగింది.

ఈ క్రమంలో రుచివర్మ తల్లి .. బంధువుల పెళ్లి ఉందని చెప్పి తీసుకెళ్ళింది. వెళ్లేముందు రుచివర్మ.. తనతో పాటుగా రూ.50 వేల నగదు, విలువైన ఆభరణాలు తీసుకెళ్లింది. పెళ్లి కోసం వెళ్ళిన తన భార్య ఇంకా రాకపోవడంతో అమిత్ .. తన భార్యకు రోజు ఫోన్‌ చేస్తుండగా స్విచ్ఛాఫ్‌ వస్తోంది. దీనితో అనుమానంతో నేరుగా అత్తింటికి వెళ్లాడు. అక్కడ రుచివర్మ.. మరో పెళ్ళికి సిద్దమవుతుండడం చూసి షాక్ అయ్యాడు.

అక్కడ స్థానికంగా ఉండేవారిని ఆమె గురించి అడిగి తెలుసుకొని మరింత షాక్‌‌‌‌కి గురయ్యాడు. రుచివర్మ పుట్టింటికి వచ్చిందే మరో వ్యక్తితో పెళ్లి చేసుకునేందుకేనని, అతడితో పాటు మరొకరిని కూడా రుచి వర్మ పెళ్లి చేసుకుందని తెలుసుకొని.. తానూ మోసపోయనని గ్రహించాడు. ఇదే విషయం పైన పోలీసులకి ఫిర్యాదు చేశాడు.

అయితే పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు కూడా బయటపడ్డాయి. పెళ్లి పేరిట మోసం చేసి అందిన కాడికి దోచుకుని వెళ్తుందని, దీనికి ఆమె తల్లి సహకరిస్తుందని తెలిసింది. దీనిపైన కేసు నమోదు చేసుకొని పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే తన భార్య ఇంత మోసం చేసినప్పటికీ తనకి తన భార్య కావాలని, తనతోనే కలిసి ఉండాలని ఉందని, ఇందుకు తనకి తగిన న్యాయం చేయాలనీ పోలీసులను కోరాడు అమిత్.

Tags

Read MoreRead Less
Next Story