రెస్టారెంట్‌లో బిర్యానీ తిని మరణించిన మహిళ.. మరో 178 మంది తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో..
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో పెరింజనం ప్రాంతంలోని స్థానిక రెస్టారెంట్ నుండి బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజన్ కావడంతో. విరేచనాలు, వాంతులు తదితర సమస్యల కారణంగా వారిని ఆసుపత్రుల్లో చేర్చారు. మృతి చెందిన మహిళను కుటిలకడవ్‌కు చెందిన ఉజైబా (56)గా గుర్తించారు. కడుపునొప్పి, వాంతులు కావడంతో ఆమెను త్రిసూర్ మెడికల్ కాలేజీలో చేర్చారు. ఆమెతో పాటు మరో ఇద్దరు బంధువులు అక్కడ చికిత్స పొందుతున్నారు.
శనివారం సాయంత్రం దుకాణం నుండి బిర్యానీ తిన్న 178 మందికి ఫుడ్ పాయిజనింగ్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో రెస్టారెంట్ ప్రస్తుతం మూసివేయబడింది. ఆరోగ్య శాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ప్రతినిధులు, పంచాయతీ అధికారులు, పోలీసులతో కలిసి రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటనపై స్పందించి రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ అధికారులు తెలిపారు. పంచాయతీ ప్రెసిడెంట్ వినీతా మోహన్‌దాస్ మాట్లాడుతూ.. పెరింజనం, కైపమంగళం వాసులు ఆస్పత్రిలో ఉన్నారు. వీరిని కొడంగల్లు, ఇరింగలకుడలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించారు. ఆరోగ్య శాఖ, పంచాయతీ, ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు హోటల్‌లో తనిఖీలు నిర్వహించారు.
జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి ఎపిడెమియాలజిస్ట్ కళా, ఐడీఎస్పీ అధికారిణి డాక్టర్ గీత ఆధ్వర్యంలో బృందం వచ్చి హోటల్‌లో ఆధారాలు సేకరించింది. ఈ ఘటనతో ఆరోగ్యశాఖ, ఆహార భద్రత విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించి హోటల్‌ను మూసివేశారు. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఆహార నమూనాలను సేకరించారు. తుది నివేదిక వచ్చిన తర్వాతే ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమేమిటో తేలనుంది.
అపరిశుభ్రతతో హోటల్ నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు కయపమంగళం పోలీస్‌స్టేషన్, పెరింజనం పంచాయతీలో ఫిర్యాదు చేశారు. ఫుడ్ పాయిజనింగ్‌తో ఆసుపత్రి పాలైన వారిని కూడా కలుసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
శనివారం రాత్రి పెరింజనంలోని సైన్ హోటల్‌లో బిర్యానీ తిన్న వ్యక్తులు జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో చేరారు. అర్ధరాత్రి జ్వరం, విరేచనాలు, వాంతులు, ఇతర అసౌకర్యాలతో ఫిర్యాదు చేసిన ప్రజలు వివిధ ఆసుపత్రులను ఆశ్రయించారు.
హోటల్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ కూడా స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com