చనిపోయిందనుకొని అంత్యక్రియలు చేశారు... 11 ఏళ్ల తర్వాత తిరిగొచ్చింది..!

చనిపోయిందనుకొని అంత్యక్రియలు చేశారు... 11 ఏళ్ల తర్వాత తిరిగొచ్చింది..!
అదృశ్యమైన లక్ష్మి తమిళనాడులోని పెరంబలూర్‌ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఓ స్వచ్చంద సంస్థ ఆమెను చేరదీసి చికిత్స అందించింది.

మానసిక స్థితి సరిగ్గా లేక ఓ వివాహిత 11 ఏళ్ల కింద తప్పిపోయింది. ఎంత వెతికాన ప్రయోజనం అయితే కనిపించలేదు. ఇక ఆమె చనిపోయి ఉంటుందని భావించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెకి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కానీ ఆమె బ్రతికే ఉందని తెలుసుకొని తీసుకొచ్చారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. జగ్గాసాగర్‌ గ్రామానికి చెందిన నర్సయ్య, రెంజర్ల లక్ష్మి (48)లకు ముగ్గురు కుమార్తెలు. ఆమె భర్త నర్సయ్య గల్ఫ్‌లో ఉండగా, 11 ఏళ్ల కిందట లక్ష్మి అదృశ్యమైంది. ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఓ రెండేళ్ళ తరవాత నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ అటవీ ప్రాంతంలో ఓ మహిళ శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఆ మహిళ దుస్తులను చూసి లక్ష్మి అనుకొని ఆమెకి అంత్యక్రియలు కూడా నిర్వహించారు.

అదృశ్యమైన లక్ష్మి తమిళనాడులోని పెరంబలూర్‌ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఓ స్వచ్చంద సంస్థ ఆమెను చేరదీసి చికిత్స అందించింది. తాజాగా ఆమె సాధారణ స్థితికి రావడంతో ఆ సంస్థ ప్రతినిధులు వివరాలు అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి ఆమెను తమ ఇంటికి తీసుకొచ్చారు. చనిపోయిందని భావించని లక్ష్మి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story