ప్రియుడిని పోలీస్‌స్టేషన్ వరకు చొక్కా పట్టి ఈడ్చుకెళ్లిన ప్రియురాలు..!

ప్రేమ అన్నాడు. పెళ్లి అన్నాడు.. అవసరం తీరాక మొఖం చాటేశాడు. అయితే జరిగిన మోసానికి ఆమె బాధపడుతూ ఓ మూలాన కూర్చోలేదు. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన అతన్ని కడిగేయాలని అనుకుంది. న్యాయం కోసం అతన్ని కాలర్ పట్టుకొని ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన రాయగడ జిల్లాలోని బిసంకటక్ సమితిలో చోటు చేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కుంకుబడి గ్రామానికి చెందిన యువకుడు సుమన్ కుసులియా ఉపాధి కోసం ఆరు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రొయ్యిల పరిశ్రమలో పనికి చేరాడు. అక్కడ విశాఖపట్నం జిల్లా పాడేరుకు చెందిన యువతి బెలసుర కుమారితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
ఈ క్రమంలో ఇద్దరు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. కలిసి కొన్నాళ్లు కాపురం చేసిన తరువాత సుమన్ ఎవరికీ చెప్పకుండా భీమవరం నుంచి బిసంకటక్ వచ్చేశాడు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది తన భర్త తిరిగిరకపోవడంతో మోసపోయానని గ్రహించిన కుమారి తన అన్నయ్య సహాయంతో స్వగ్రామంలో ఆటో నడుపుతున్నాడని తెలుసుకుంది.
శనివారం ఆటోస్టాండ్‌లో సుమన్ కనిపించడంతో సుమన్‌ను నిలదీసింది. తనతో రమ్మని ప్రాధేయపడింది. తనకు కొద్ది రోజు క్రితమే వేరే అమ్మాయితో వివాహం జరిగిందని చెప్పడంతో షాక్ తిన్న ఆమె ఆగ్రహానికి గురై అందరూ చూస్తుండగానే అతన్ని షర్ట్ కాలర్ పట్టుకొని పోలిస్ స్టేషన్ వరకు లాకేల్లింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com