పెళ్లి కావడం లేదని ఆవేదనతో మహిళా ఎస్సై ఆత్మహత్య..!

ఆమె ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్.. చాలా కష్టపడి ఆ ఉద్యోగాన్ని సంపాదించుకుంది. ఆమెకి ప్రస్తుతం 35 సంవత్సరాలు.. సెలవుల్లో ఇంటికి వెళ్ళిన సమయంలో బంధువులు, ఇంటి పక్కన వాళ్లంతా పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇలా పదే పదే అడుగుతుండడంతో ఆమెలో ఆవేదన మొదలైంది. అదే ఆవేదనే ఆమెను అత్మహత్యకి ప్రేరేపించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో చోటు చేసుకుంది. కవితా సోలంకి అనే మహిళా.. సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. అయితే పెళ్లి కావడం లేదని గత కొన్ని నెలలుగా తీవ్ర మనోవేదనకు గురవుతోంది.
దీనితో బుధవారం రాత్రి తన అధికార నివాసంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం తన స్నేహుతురాలికి ఫోన్ చేసి ఆత్మహత్యాయత్నం చేసినట్లు వెల్లడించింది. వెంటనే ఆమె సంఘటన స్థలానికి చేరుకొని ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆమె బ్రతకలేదు. మృతిరాలి ఇంటివద్ద పోలీసులకి సూసైడ్ నోట్ కనిపించింది. అందులో తనకి పెళ్లి కావడం లేదని, వివాహం పైన ఆందోళన చెందుతున్నట్లు, ఇరుగుపొరుగు వారి మాటలకు సమాధానం చెప్పలేక అలసిపోయానని రాసుంది. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com