క్రైమ్

కుల బహిష్కరణ చేయడంతో యువకుడి ఆత్మహత్య

కుల బహిష్కరణ చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా అల్లా దుర్గం మండలం ముస్లాపూర్‌ గ్రామంలో ఈ దారుణం జరిగింది.

కుల బహిష్కరణ చేయడంతో యువకుడి ఆత్మహత్య
X

కుల బహిష్కరణ చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా అల్లా దుర్గం మండలం ముస్లాపూర్‌ గ్రామంలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఇప్ప శంకర్‌ అనే యువకుడి కుటుంబాన్ని కుల పెద్దలు కుల బహిష్కరణ చేశారు. గ్రామంలోని ముగ్గురు కుల పెద్దలు తమను బహిష్కరించారంటూ జనవరి 6న అల్లాదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఇప్ప శంకర్ మనస్తాపం చెందాడు. దీంతో అర్ధరాత్రి పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తన ఆవేదనను చెబుతూ ఓ వీడియో రికార్డ్ చేశాడు ఇప్ప శంకర్.

Next Story

RELATED STORIES