ప్రేమించిన అమ్మాయి, స్నేహితులు మోసం చేశారని సూసైడ్..!

హైదరాబాద్‌లోని వనస్థలిపురం పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని, స్నేహితులు సైతం మోసం చేశారంటూ... ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు బ్రహ్మం అనే వ్యక్తి. స్థానిక వీఎమ్మార్ గ్రాండ్ హోటల్‌లో రూం తీసుకున్న బ్రహ్మం... సూసైడ్ దృశ్యాలను ఫేస్‌బుక్ లైవ్‌లో రికార్డు చేశాడు. చనిపోయే ముందు.. అమ్మకు, భార్యకు క్షమాపణలు చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా పసుపుగల్లు గ్రామానికి చెందిన షేక్ బ్రహ్మంలారీ యజమాని. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోయాడు. శనివారం ఉదయం అతని స్నేహితుడు వేణుగోపాల్‌తో కలిసి వనస్థలిపురం ఆటోసాయినగర్‌లోని వీఎంఆర్ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఈక్రమంలో మధ్యాహ్నం ఇద్దరూ కలిసి బార్‌లో మద్యం సేవించి గదిలోకి వెళ్లి పడుకున్నారు.
తిరిగి సాయంత్రం బార్‌కి వచ్చి మళ్లీ మద్యం సేవించారు. ఆతర్వాత షేక్ బ్రహ్మం తన గదికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. అనంతరం తాను..చనిపోతున్నానని, ప్రేమించి మోస పోయానని.. స్నేహితులు మోసం చేశారని చెబుతూ ఫ్యాన్‌కు లుంగీతో ఉరేసుకున్నాడు. ఈ దృశ్యాలు ఫేస్‌బుక్ లైవ్‌లో ఉన్నాయి. ఆ సమయంలో స్నేహితులు, బంధువులు ఫోన్ చేసినా ఫోన్ తీయలేదు. వేణుగోపాల్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో బ్రహ్మం ఉన్న గదికి వెళ్లాడు. గది తలుపులు వేసి ఉండటంతో కిటికీలోంచి చూసే సరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. లాడ్జి సిబ్బంది వచ్చి తలుపులు తెరిచే సరికి అప్పటికే మృతి చెందాడు. బ్రహ్మం మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. బ్రహ్మం బంధువులకు సమాచారమందించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com