Real Love Story : సినిమాని మించిన లవ్ స్టోరీ.. !
సెల్వన్ అనే యువకుడు, ఇళమతి అనే యువతి ఇద్దరు కొలీగ్స్... పనిచేసేది ఒకే కంపెనీ కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమకి దారి తీసింది.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నారు... కానీ కులాలు వేరు కావడంతో పెద్దలు కాదన్నారు.
కన్నవాళ్లను కాదనుకుని బయటకు వచ్చి కలిసి బ్రతకాలని అనుకున్నారు.. అనుకున్నట్టుగానే పెళ్లి చేసుకొని ఓ చోట కాపురం పెట్టారు.. ఓ నెల రోజులు అంతాబాగానే ఉంది. కానీ ఓ రోజు యువతి కుటుంబం ఆ యువకుడిని కొట్టి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. దీనితో తీవ్ర మనోవేదనకి గురైన సెల్వన్ పోలీసులను ఆశ్రయించాడు.
అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రికి ఇళమతి కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాల ఉండడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని సెల్వన్ ఆరోపించాడు. ఈ క్రమంలో తనని చంపాలని చూస్తున్నారని ఇళమతి ఇటీవల వాట్సాప్‌లో మెసేజ్ చేయడంతో యువకుడు మీడియాని ఆశ్రయించాడు.
దీనితో ఇష్యూ పెద్దది కావడంతో తన భార్యకు ప్రాణహాని ఉందని ఆ యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com