Accident : నాగోల్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

X
By - Vijayanand |3 March 2023 9:30 AM IST
కారు ఢీకొనడంతో ఆ వ్యక్తి గాల్లో తేలుతూ 20అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు
నాగోల్ రామాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని అతివేగంతో కారు ఢీ కొట్టింది. అనంతరం అదే వేగంతో స్తంభాన్ని ఢీకొని కారు ఆగింది. కారు ఢీకొనడంతో ఆ వ్యక్తి గాల్లో తేలుతూ 20అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. బాధితుడ్ని నాగారం నివాసి జైకుమార్‌గా గుర్తించారు. గాయపడిన జైకుమార్‌ను కారును డ్రైవ్ చేస్తున్న మహిళ ప్రమాదానికి కారణమైన కారులోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. జైకుమార్ నాగోలులోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com