Hyderabad: ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి..

Hyderabad: ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి..
Hyderabad: శంషాబాద్‌ మండలంలోని పెద్ద గోల్కోండ ఔటర్‌పై ఆగి ఉన్న లారీని వేగంగా కారు ఢీకొట్టింది.

Hyderabad: హైదరాబాద్‌ ఔటర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్‌ మండలంలోని పెద్ద గోల్కోండ ఔటర్‌పై ఆగి ఉన్న లారీని వేగంగా కారు ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు కారులోనే ఇరుక్కుని మృతి చెందారు. తక్కుగూడ వైపు నుంచి గచ్చిబౌలీ వైపు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కారులోనుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story