UP: కీచక ప్రొఫెసర్ ఫోన్‌లో 72 అశ్లీల వీడియోలు

యూపీలోని హధ్రాస్ లో ప్రొఫెసర్ రజినీష్ కుమార్ దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రజినీష్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఈ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మార్కులు వేస్తానని, ఉద్యోగాల ఇప్పిస్తానని అమ్మాయిలపై కొన్నేళ్లుగా అత్యాచారం చేసినట్లు రజినీష్ ఒప్పుకున్నాడు. లైంగిక దాడి దృశ్యాలు రికార్డ్ చేయడానికి కంప్యూటర్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. రజనీష్ వందల మంది విద్యార్థుల్ని లోబర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి ఫోన్‌లో అశ్లీల వీడియోలే ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులను లైంగికంగా వేధించిన వీడియోలను ఈ కీచక ప్రొఫెసర్ రికార్డు చేశాడని పోలీసులు తెలిపారు. వాటిని ఫోన్‌లో భద్రపరుచుకున్నాడని చెప్పారు. దాదాపు 72కుపైగా అశ్లీల వీడియోలు ఫోన్‌లో ఉన్నాయని వెల్లడించారు.
2009 నుంచే లైంగికదాడి
సేఠ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కాలేజీలో పని చేస్తున్న రజనీష్ కుమార్ 2009లో తొలిసారి ఓ విద్యార్థినిని లోబర్చుకున్నాడు. మంచి మార్కులు వేస్తానని చెప్పి లైంగిక దాడి చేశాడు. ఆ లైంగిక దాడిని వెబ్ కెమెరాలో రికార్డు చేశాడు. ఆ పేరుతో ఆ అమ్మాయిని బెదిరించి చాలా కాలం లైంగికదాడికి పాల్పడ్డాడు. అప్పట్నుంచి..తన వలలో పడే విద్యార్థినులను ఇలాగే లైంగికంగా వేధించి రికార్డు చేసుకోవడం ప్రారంభించాడు. తమ వేధింపుల గురించి ఎవరికీ చెప్పకుండా చదువు పూర్తి చేసుకుని వెళ్లిపోయేవారు.
బ్లాక్ మెయిల్ చేసి..
హథ్రాస్ పీజీ కాలేజీ జియాలజీ ప్రొఫెసర్ రజనీష్ కుమార్.. విద్యార్ధినులపై చేసిన లైంగిక వేధింపులు బహిర్గతం అయ్యాయి. రజనీష్ కుమార్.. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడి, వీడియోలు తీస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు ఆ కీచక ప్రొఫెసర్ పాపం పడింది. ప్రయాగ్‌రాజ్‌లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com