Rajasthan : పెళ్ళైన రెండు రోజులకే అత్తామామలకి విషం ఇచ్చిన కోడలు..!

Rajasthan : పెళ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగుపెట్టిన రెండు రోజులకే నవవధువు దారుణానికి పాల్పడింది. అత్తామామలు, భర్త తిన్న అన్నంలో విషం కలిపింది. వారు స్పృహ కోల్పోగానే నగదు, నగలతో పారిపోయింది.. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. మరుసటి రోజు ఇంట్లోని వారు ఎంతకీ నిద్ర లేవకపోవడంతో బంధువులు తలుపులు పగలగొట్టి చూడగా వారంతా పడిపోయి ఉన్నారు. కొనఊపిరితో ఉన్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే వారికి ప్రాణహాని తప్పడం అదృష్టమన్నారు వారి బంధువులు.. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సదరు యువతిని ఓ మధ్యవర్తి చూపించాడని, అతనికి రూ. లక్ష ముట్టజెప్పినట్లుగా వరుడు తండ్రి పోలీసులకి వెల్లడించాడు. వధువు పేరు, అడ్రెస్ కూడా తప్పుగా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com