మాజీ ఎమ్మెల్యే అక్రమ ఆస్తులు.. నాలుగేళ్ల జైలు శిక్ష.. రూ.33 లక్షల జరిమానా

విల్లుపురం ప్రిన్సిపాల్ జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం చిన్న సేలంకు చెందిన మాజీ ఎఐఎడిఎంకె ఎమ్మెల్యే ఆర్‌పి పరమశివంను అక్రమ ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
ప్రధాన జిల్లా న్యాయమూర్తి కె.హెచ్.లావజగన్.. పరమశివంపై రూ. 33 లక్షల జరిమానా విధించారు. విల్లుపురం జిల్లా చిన్న సేలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1991లో అన్నా డీఎంకే అభ్యర్థిగా పరమశివం అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1991-96 కాలంలో అన్నాడీఎంకే పాలనలో అవినీతి విలయతాండవం చేసినట్లు ఆరోపణలు రుజువు కావడంతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే కొరడా ఝళిపించే పనిలో పడింది. దివంగత సీఎం జయలలిత, చిన్నమ్మ శశికళతో పాటు పలువురు నేతలపై కేసులు దాఖలయ్యాయి. ఇప్పుడు పరమశివం వంతు వచ్చింది.
ప్రాసిక్యూషన్ ప్రకారం, విల్లుపురం డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ పరమశివం, అతని భార్య పూంకోడిపై జూన్ 17న రూ.28 లక్షల వరకు అక్రమ ఆస్తులను కూడబెట్టినందుకు కేసు నమోదు చేశారు. మే 13, 1996 వారి సంపాదనకు మించి ఆదాయ వనరులు ఉన్నట్లు తెలుసుకున్నారు.
పూంకోడి మరణించిన తరువాత ఆమెపై ఆరోపణలు తగ్గాయి. విచారణ పూర్తయిన తరువాత, కోర్టు పరమశివంను దోషిగా నిర్ధారించి రూ.33 లక్షల జరిమానా విధించింది. అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. దాదాపు రెండు దశాబ్ధాల అనంతరం వెలువడిన తీర్పులో పరమశివంకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.3 3 లక్షల జరిమానా విధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com