Air India Urination Row: నిందితుడికి బెయిల్ మంజూరు

తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి డిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు తన పక్కన కూర్చున్న ఓ వృద్ద మహిళపై మూత్ర విసర్జన చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. చాలా కాలంపాటు తప్పించుకు తిరిగిన శంకర్ మిశ్రాను డిసెంబర్ 2022న బెంగళేరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ హైకోర్టు మిశ్రాకు రిమాండ్ విధించింది.
జనవరి 7న అరెస్ట్ అయిన మిశ్రాకు రూ.ఒక లక్ష బాండ్ తోపాటు అంత మొత్తానికి పూచీకత్తుపై బెయిల్ మంజూరుచేసింది ఢిల్లీ కోర్టు. మిశ్రా బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ పాటియాలా హౌజ్ సోమవారం రిజర్వ్ చేసింది. నవంబర్ 26న జరిగిన ఘటనతో అంతర్జాతీయ వేదికలపై భారత్ పరువు తీశారని వాదిస్తూ ఢిల్లీ పోలీసులు నిందితుడికి బెయిల్ ను వ్యతిరేకించారు. ఇందుకు స్పందించిన కోర్టు... నిందితుడు చేసిన పని అసహ్యంగా ఉందని అయితే చట్టానికి లోబడి వ్యవహరించాలని అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com