Akanksha Dubey Suicide: భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్య

ప్రముఖ భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్యకు పాల్పడ్డారు. దుబే మరణ వార్తతో భోజ్‌పురి పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని ఓ హోటల్‌లో నటి శవమై కనిపించింది. 'మేరీ జంగ్ మేరా ఫైస్లా' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆకాంక్ష. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆకాంక్ష దుబే ఓ షూటింగ్ కోసం వారణాసికి వెళ్లినట్లు తెలుస్తోంది. చిత్రీకరణ తర్వాత, సారనాథ్ హోటల్‌కి వెళ్లింది. అనంతరం ఆమె హోటల్ గదిలో శవమై కనిపించింది. హోటల్‌లో ఆకాంక్ష చనిపోవడానికి కొన్ని గంటల ముందు, ఆమె భోజ్‌పురి పాట హిలోర్ మేరేలో తన బెల్లీ డ్యాన్స్ స్కిల్స్‌ను ప్రదర్శిస్తూ తన వీడియోను షేర్ చేసింది. ఆకాంక్ష భడోయికి చెందిన వ్యక్తి. మేరీ జంగ్ మేరా ఫైస్లాతో పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె ముజ్సే షాదీ కరోగి (భోజ్‌పురి), వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్‌లో కూడా కనిపించింది. చిన్న వయసులోనే తన నటనా నైపుణ్యంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఆకాంక్ష.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com