నా భార్య రోజూ స్నానం చేయడం లేదు.. విడాకులు ఇప్పించండి మహాప్రభో..!

నా భార్య రోజూ స్నానం చేయడం లేదు.. విడాకులు ఇప్పించండి మహాప్రభో..!
భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కాడు ఓ భర్త.. అయితే అతను చెప్పిన కారణం మాత్రం అందరిని షాక్‌‌కి గురి చేసింది.

భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కాడు ఓ భర్త.. అయితే అతను చెప్పిన కారణం మాత్రం అందరిని షాక్‌‌కి గురి చేసింది. ఇంతకీ అతను చెప్పిన సమాధానం ఏంటంటే.. తన భార్య రోజూ స్నానం చేయడం లేదట.. ఇదే కారణం చెబుతూ విడాకులు ఇప్పించాలని కోర్టులో పిటిషన్‌ వేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అలీఘర్‌లో చోటుచేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. క్వార్సీ గ్రామానికి మహిళకు చందౌస్ గ్రామానికి చెందిన వ్యక్తికి రెండేళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే తన భార్య రోజూ స్నానం చేయదని, స్నానం చేయమని చెబితే గొడవ పడుతుందని అందుకే విడాకులు కోరుతున్నట్టుగా పేర్కొన్నాడు. అయితే తన భర్తపై వ్యతిరేకంగా భార్య వుమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌లో ఫిర్యాదు చేసింది. దీనితో ఈ విషయం బయటకు వచ్చింది.

తన భర్తకి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని ఆమె చెప్పగా ప్రస్తుతం వీరికి కౌన్సిలింగ్ జరుగుతుంది. అయితే వీరి వివాహ బంధం కొనసాగించడానికే కౌన్సిలింగ్ అందిస్తున్నామని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిలింగ్ చెబుతుంది. చిన్న చిన్న సమస్యలకే వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దని తాము సూచించినట్లుగా కౌన్సిలర్ చెబుతున్నారు. కౌన్సిలింగ్ సహాయంతో వీరి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story