వయసు 16.. అమ్మ వద్దు.. భార్యే ముద్దంటూ కోర్టుకి..

వయసు 16.. అమ్మ వద్దు.. భార్యే ముద్దంటూ కోర్టుకి..
పట్టుమని 16 ఏళ్లు కూడా లేవు. అప్పుడే భార్యా పిల్లలు. ఆమ్మ వారించినా వినకుండా ఆమెతో సహజీవనం చేసి పిల్లాడిని కూడా కన్నాడు.

పట్టుమని 16 ఏళ్లు కూడా లేవు. అప్పుడే భార్యా పిల్లలు. ఆమ్మ వారించినా వినకుండా ఆమెతో సహజీవనం చేసి పిల్లాడిని కూడా కన్నాడు. కొడుకు వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది తల్లి.

ఉత్తరప్రదేశ్ అలహాబాద్ హైకోర్టుకు ఓ వింత కేసు వచ్చింది. 16 ఏళ్ల కుర్రాడు తన తల్లితో కలిసి జీవించడానికి ఇష్టపడకపోవడంతో, కోర్టు బాలుడుని ప్రభుత్వ వసతి గృహంలో ఉండమని తీర్పు చెప్పింది. అతడికి 18 వచ్చి మేజర్ అయ్యాక ఎక్కడ ఉండాలీ తేల్చుకోమని చెప్పింది. 2022 ఫిబ్రవరి 4న బాలుడికి 18 ఏళ్లు వస్తాయి అప్పటి వరకు రాష్ట్ర వసతి గృహంలోఉండటానికి ఏర్పాట్లు చేయాలని ఇది అధికారులను ఆదేశించింది.

ఆ తర్వాత తన 'భార్య'తో సహా తనకు నచ్చిన వారితో కలిసి ఉండవచ్చని కోర్టు స్పష్టం చేసింది. మే 31 న ఇచ్చిన తీర్పును కోర్టు వెబ్‌సైట్‌లో సోమవారం అప్‌లోడ్ చేశారు. బాలుడి తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ జస్టిస్ జెజె మునీర్ ఈ ఉత్తర్వు జారీ చేశారు.

పిటిషనర్ తల్లి విజ్ఞప్తి మేరకు మైనర్ అబ్బాయికి బాలికను వివాహం చేసుకోవడానికి చట్టపరమైన అనుమతి లేదని మరియు చట్టం ప్రకారం ఈ వివాహం శూన్యమని ఆమె కొడుకుతో వాగ్యుద్ధానికి దిగింది. మాట వినని కొడుకు మీద కేసు పెట్టి కోర్టుకు తీసుకువెళ్లింది. కేసుని విచారించిన న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు.

ఈ టీనేజ్‌ను 2020 సెప్టెంబర్ 18 న కోర్టులో హాజరుపరిచారు. కోర్టు తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నప్పుడు, అతన్ని చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే, మైనర్ బాలుడు తన 'భార్య' తో కలిసి ఉండటానికి అనుమతించాలన్న అతడి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఇక్కడ 'భార్య' మేజర్ కావడం విశేషం. అయినా వారి మధ్య ప్రేమ చిగురించి కొన్ని రోజులు సహజీవనం చేసి అనంతరం పెళ్లి చేసుకున్నారు. వారికి ఇప్పుడు ఓ బాబు కూడా ఉన్నాడు.

కోర్టు మాట్లాడుతూ, పోక్సో చట్టం ప్రకారం ఒక మైనర్ అబ్బాయి ఒక మేజర్ అమ్మాయితో కలిసి సహజీవనం చేయడం నేరం అని తీర్పు చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story