Shalu Chourasiya: కేబీఆర్ పార్క్ వద్ద నటిపై దాడి..

Shalu Chourasiya (tv5news.in)
X

Shalu Chourasiya (tv5news.in)

Shalu Chourasiya: ఆదివారం రాత్రి కేబీఆర్ పార్క్ వద్దకు వచ్చిన హీరోయిన్ షాలు చౌరాసియాపై దుండగుడు దాడి చేశాడు.

Shalu Chourasiya: కేబీఆర్ పార్క్ వద్ద మామూలు ప్రజలే కాదు.. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కూడా తారసపడుతుంటారు. వారందరూ అక్కడికి వాకింగ్‌కు వస్తుంటారు. అలాగే ఆదివారం రాత్రి అక్కడికి వాకింగ్‌కు వచ్చిన హీరోయిన్ షాలు చౌరాసియాపై దుండగుడు దాడి చేశాడు.

బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌ రోడ్‌ నంబర్‌ 9 వద్ద చౌరాసియా వాకింగ్‌కు వెళ్లింది. అదే సమయంలో ఒక దుండగుడు తన ఫోన్‌ను లాకెళ్లాడు. అడ్డుకునే ప్రయత్నంలో తనకు గాయాలయ్యాయి. అతడు పారిపోగానే నటి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. గాయాలపాలైన చౌరాసియాను ఆసుపత్రికి తరలించారు.

Tags

Next Story