Secunderabad: సోషల్ మీడియాలో స్నేహం.. చివరికి కలుద్దామని చెప్పి దారుణం..

Secunderabad: సోషల్ మీడియాలో స్నేహం.. చివరికి కలుద్దామని చెప్పి దారుణం..
Secunderabad: సికింద్రాబాద్‌ గోపాలపురంలో దారుణం జరిగింది. షేర్ చాట్ యాప్ ఓబాలిక కొంప ముంచింది.

Secunderabad: సికింద్రాబాద్‌ గోపాలపురంలో దారుణం జరిగింది. షేర్ చాట్ యాప్ ఓబాలిక కొంప ముంచింది. బాధిత బాలికకు, నిందితుడు శ్రీగిరి మధుకు మధ్య షేర్‌ చాట్‌లో పరిచయమయ్యాడు. 8రోజులు యాప్‌లో చాట్ చేశారు. తనను కలవాలని నిందితుడు చెప్పడంతో నమ్మి వెంట వెళ్లిన బాలికకు అనుకోని అనుభవం ఎదురైంది. బాలికను బేగంపేట ఓయో రూమ్‌కు తీసుకెళ్లిన నిందితుడు రాత్రంతా అత్యాచారం చేశాడు. బాలికను హోటల్‌లోనే వదిలి పరారయ్యాడు. బాలిక ఆచూకీ కోసం సాయంత్రం దాకా ఆమె తల్లిదండ్రులు వెతికారు. ఓ యువకుడితో బైక్‌పై వెళ్లిందనే ఆమె స్నేహితుల సమాచారంతో పోలీసులను ఆశ్రయించారు.

ఉదయం బాలికే తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో పోలీసులు, కుటుంబ సభ్యులు హోటల్‌కు చేరుకున్నారు. బాధితురాలిని విచారించిన పోలీసులు.. భరోసా సెంటర్‌కు తరలించారు. నిందితుడు శ్రీగిరి మధును అరెస్ట్ చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సోషల్ మీడియా పరిచయాలు నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు ఫోన్లు ఇస్తే సరిపోదని, నిఘా ఉంచాలని సూచిస్తున్నారు. ఏదిమంచి, ఏదిచెడు అనే విషయాన్ని తల్లిదండ్రులే పిల్లలను కూర్చోబెట్టుకుని చెప్పాలంటున్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story