Anantapur: మహిళా పోలీస్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. హ్యాండ్ బ్యాగ్‌లో సూసైడ్ నోట్..

Anantapur: అనంతపురం జిల్లా లేపాక్షిలో.. మూడ్రోజుల క్రితం మహిళా పోలీస్ సావిత్రి చెరువులో పడి మృతి చెందిన ఘటన మిస్టరీగా మారింది. సచివాలయ ఉద్యోగుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన లెటర్ బయటపడింది. మృతురాలి హ్యాండ్ బ్యాగ్‌ను పరిశీలించగా.. ఈ లెటర్ దొరికింది. ఈ సూసైడ్ నోట్ దొరకడంతో.. ఈ ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది.
చిలమత్తూరు మండలం, దేమకేతేపల్లి గ్రామ సచివాలయ మహిళా పోలీస్‌గా విధులు నిర్వహిస్తోంది సావిత్రి. ఆమె ఈ నెల 4న లేపాక్షి పెద్ద చెరువులో పడి ఆత్మహత్యకు చేసుకుంది. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బంధువులు. కానీ సడన్‌గా సూసైడ్ నోట్ దొరకడం కలకలం రేపింది. సచివాలయంలో పని చేసే ఓ ఉద్యోగి తన ఫోన్‌ను ట్రాప్ చేసి వేధింపులకు గురి చేస్తున్నాడంటూ.. లెటర్ రాసుకుంది సావిత్రి.
అంతే కాదు.. తనను రేప్ చేసి చంపాలని చూస్తున్నారంటూ అందులో పేర్కొంది. ఈ లెటర్ దొరకడంతో మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ సూసైడ్ నోట్ బయటపడటంతో.. స్థానిక సచివాలయ ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com