CRIME: ఇక అలాంటి పనులు చేయను: యాంకర్ శ్యామల

CRIME: ఇక అలాంటి పనులు చేయను: యాంకర్ శ్యామల
X

బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ యాంకర్ శ్యామల విచారణ ముగిసింది. మూడు గంటలకు పైగా శ్యామలను పంజాగుట్ట పోలీసులు విచారించారు. . బెట్టింగ్ లకు పాల్పడటం, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం తప్పేనని శ్యామల వ్యాఖ్యానించారు. పోలీసుల విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తున్నానని తెలిపారు. బెట్టింగ్ యాప్‌ల ద్వారా చనిపోయిన వారిని...కేసు కోర్టు పరిధిలో ఉన్నందున విచారణ గురించి మాట్లాడటం సరికాదన్నారు. బాధ్యత గల పౌరురాలిగా బెట్టింగ్ ను ఇకపై ప్రమోట్ చేయనని స్పష్టం చేశారు. ఇకపై అలాంటి పనులకు దూరంగా ఉంటానని చెప్పారు. న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన శ్యామల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ఉదయం 8:44 ప్రాంతంలో యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చారు. సుమారు మూడున్నర గంటలుగా యాంకర్ శ్యామలను పోలీసులు విచారణ జరిపారు.

Tags

Next Story