Andhra Pradesh : వివేకా హత్యకేసులో సీబీఐ దూకుడు

Andhra Pradesh : వివేకా హత్యకేసులో సీబీఐ దూకుడు
వైఎస్ భారతి పీఏ నవీన్‌తో పాటు మరో వ్యక్తికి సీబీఐ నోటీసులు ఇచ్చింది

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. హత్య అనంతరం జరిగిన పరిణామాలపై నజర్ పెట్టింది. కడపకు చేరుకున్న సీబీఐ బృందం, ఎంపీ అవినాష్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించింది. తాజాగా వైఎస్ భారతి పీఏ నవీన్‌తో పాటు మరో వ్యక్తికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. హత్య జరిగిన రోజు ఎంపీ అవినాష్ రెడ్డి నవీన్‌కు కాల్ చేసినట్లు సీబీఐ అధికారులు తేల్చారు. నవీన్‌ ఫోన్ నుంచి భారతి మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే రోజు అవినాష్ రెడ్డి మరో వ్యక్తికి కూడా ఫోన్ చేశారు. అయితే ఆ ఫోన్ నుంచి జగన్‌ మాట్లాడినట్లు గుర్తించారు. ఇక ఆ ఇద్దరు వ్యక్తులకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాసేట్లో సీబీఐ ముందుకు నవీన్ రానున్నారు.

ఇక విచారణలో భాగంగా ఇవాళ సీబీఐ అధికారుల బృందం పులివెందులకు వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోమారు తనిఖీలు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. హత్య కేసులో తొలి నుంచి అవినాష్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. వివేకా కుటుంబ సభ్యులు సైతం వివేకా హత్యపై అనుమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ దూకుడు పెంచడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story