పకోడీ బండి వద్ద వివాదం.. బాలుడిని పొట్టనపెట్టుకుంది

పకోడీ బండి వద్ద వివాదం.. బాలుడిని పొట్టనపెట్టుకుంది
పర్యవసానం ఇరుకుంటుంబాల్లో ఎంతటి విషాదం చోటు చేసుకుంటుందో ఏమాత్రం స్పురణకు రావట్లేదు. చిన్న గొడవ చినికి చినికి గాలివానై చిరువ్యాపారి కొడుకుని బలితీసుకుంది.

చిన్న చిన్న విషయాలకే దాడులు, కత్తులు దూయడాలు, రాడ్లతో మోదడాలు.. మనిషి తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు.. క్షణికావేశంలో తానేం చేస్తున్నాడో తనకే అర్థం కానట్టు ప్రవర్తిస్తున్నాడు. పర్యవసానం ఇరుకుంటుంబాల్లో ఎంతటి విషాదం చోటు చేసుకుంటుందో ఏమాత్రం స్పురణకు రావట్లేదు. చిన్న గొడవ చినికి చినికి గాలివానై చిరువ్యాపారి కొడుకుని బలితీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లాంపూడి మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని వీరవరం గ్రామంలో యేసు అనే వ్యక్తి చికెన్ పకోడి బండి నడుపుతున్నాడు. పదవ తరగతి చదువుతున్న అతని కుమారుడు బండి వద్ద చిన్న చిన్న పనులు చేస్తూ తండ్రికి సహాయంగా ఉన్నాడు.

ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న కొవ్వూరి వీరబాబు కారులో పకోడి బండి వద్దకు వచ్చాడు. కారులో కూర్చునే పకోడి ఆర్డర్ ఇచ్చాడు వీరబాబు.. ఈ క్రమంలోనే వీరబాబు, యేసు మధ్య స్వల్ప వివాదమైంది. దీంతో వీరబాబుకి కోపం నషాళానికి అంటింది. దానికి మద్యం కూడా తోడైంది. యేసు బాబు మీద కోపంతో కారుని పకోడీ బండి మీదకు పోనిచ్చాడు. ఊహించని ఈ పరిణామానికి అక్కడే ఉన్న యేసు కుమారుడు శివ తీవ్రంగా గాయపడ్డాడు.

అయినా వీరబాబు వెనక్కి తగ్గలేదు. గాయపడిన శివుడిపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శివుడిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ శివ మరణించాడు. దీంతో స్థానికులు, యేసు బాబు కుటుంబం వీరబాబుపై ఆగ్రహోదగ్రులయ్యారు. గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. వీరబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story