Andrew Tate case : ఆండ్రూ టేట్‌పై లైంగిక దాడి కేసు!

రొమేనియాలో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆండ్రూ టేట్‌పై అత్యాచారం, మానవ అక్రమ రవాణా, మహిళలపై లైంగిక వేధింపుల కేసు

రొమేనియాలో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆండ్రూ టేట్‌పై అత్యాచారం, మానవ అక్రమ రవాణా, మహిళలపై లైంగిక వేధింపుల కేసు తీవ్ర వివాదస్పదమైంది. టేట్‌ తన సోదరుడు ట్రిస్టన్‌తో కలిసి ఓ క్రైమ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినట్లు కథనాలు వెలువడ్డాయి.

హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ఆరోపణలతో గతేడాది డిసెంబర్‌లో బుకారెస్ట్‌లో టేట్‌ సోదరులను అరెస్ట్‌ చేశారు. మార్చిలో రోమేనియన్ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుతో వారిని కస్టడీ నుంచి గృహ నిర్బంధానికి తరలించారు. అయితే, ఆ సమయంలో టేట్‌పై విష ప్రయోగం జరిగిందని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడు.

బుకారెస్ట్ కోర్టులో దాఖలైంది. నలుగురు నిందితులు 2021లో రొమేనియాతో పాటు యూఎస్‌, యూకే సహా ఇతర దేశాల్లో ఒక వ్యవస్థీకృత క్రిమినల్ గ్రూప్‌ను ఏర్పరుచుకుని మానవ అక్రమ రవాణాకు యత్నించారని పిటిషనర్లు పేర్కొన్నారు.

ప్రేమ, పెళ్లి పేరుతో తప్పుడు వాగ్దానాలు చేసిన టేట్ సోదరులు రిక్రూట్ చేసుకున్నారని ఏడుగురు బాధితులు ఆరోపించారు.

బలవంతంగా అశ్లీల చిత్రాలు తీయించి...

టేట్‌ బృందం బాధితులను రొమేనియాలోని ఇల్ఫోవ్ కౌంటీలో భవనాలకు తీసుకువెళ్లి వారిని బెదిరించి, నిరంతరం నిఘా ఉంచి టార్చర్‌ చేశారని, ఆ తర్వాత అశ్లీల చిత్రాల్లో నటించాలని బలవంతం చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు మార్చి 2022లో ఓ మహిళపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు.

ఈ కేసు విచారణ పూర్తి కావడాని చాలా కాలం పడుతుంది. కేసు ఫైల్‌లను విచారణకు పంపడానికి ముందు వాటిని పరిశీలించడానికి రొమేనియన్ న్యాయస్థాన న్యాయమూర్తికి ఇప్పుడు 60 రోజుల గడువు ఉంది.

టేట్‌పై మనీలాండరింగ్, మైనర్‌ల అక్రమ రవాణా సహా పలు అభియోగాలు ఇంకా విచారణలో ఉన్నాయి.

తరచూ వివాదాల్లో టేట్‌

  • ఆండ్రూ టేట్ ఒక బ్రిటీష్-అమెరికన్, మాజీ కిక్‌ బాక్సర్. ఓ మహిళపై దాడి చేసిన కారణంగా బ్రిటిష్ టీవీ షో ‘బిగ్ బ్రదర్’ నుంచి అతడిని తొలగించారు.
  • లైంగిక వేధింపులకు గురైన మహిళలు "కొంత బాధ్యత వహించాలి" అని వివాదాస్పద ట్వీట్‌ చేసినందుకు ట్విట్టర్‌ అతడి అకౌంట్‌ను తొలగించింది.

సోషల్ మీడియాలో నిషేధాలు ఉన్నప్పటికీ, అతడి హైపర్‌ ఆక్టివ్‌నెస్‌, లక్సరీ లైఫ్‌టైల్‌ వల్ల ఎప్పుడూ ట్రెండిండ్‌లోనే ఉండేవాడు.

Tags

Read MoreRead Less
Next Story