HYD: రూ. 20 వేల అప్పు తీర్చలేదని మహిళ హత్య
హైదరాబాద్ లో దారుణం జరిగింది. రూ. 20 వేల అప్పు నర్సమ్మ అనే ఒక మహిళ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఎల్బీనగర్‌లో సరోజిని అనే మహిళ నర్సమ్మకు రూ. 20 వేల అప్పు ఇచ్చింది. ఈ రుణం తీర్చమని చాలా రోజుల నుంచి నర్సమ్మను ఆమె అడుగుతోంది. అయితే ఎంతకీ అప్పు తీర్చకపోవడంతో కోపంతో సరోజిని.. నర్సమ్మను సుత్తితో కొట్టి హత్య చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థినిపై కరస్పాండెంట్ లైంగిక దాడి
అనంతపురంలో ఓ పాఠశాల కరస్పాండెంట్ విద్యార్థినిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాలిక పాఠశాల వసతిగృహంలో ఉంటూ నాలుగో తరగతి చదువుతోంది. విద్యార్థిని భోజనం చేసి ప్లేట్‌ను పైఅంతస్తులో ఉన్న గదిలో పెట్టేందుకు వెళ్లగా కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ బాలికను బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు మరో బాలికపై కూడా వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది.
20 రోజుల్లో 14 మంది చిన్నారుల మరణం
ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆశా కిరణ్ మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో చిన్నారులు అనుమానాస్పదంగా మరణిస్తుండడం కలకలం రేపుతోంది. 20 రోజుల వ్యవధిలో 14 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఎక్కువ మంది మానసిక వికలాంగులే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 27 మంది చనిపోగా వారి మరణాలకు గల కారణాలు తెలియకపోవడం సంచలనంగా మారింది. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com