దుర్మార్గుడు.. తొమ్మిదేళ్ల చిన్నారిని దుకాణంలోకి తీసుకెళ్లి, షట్టర్ వేసి..

హైదరాబాద్ మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబీబ్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల చిన్నారిని ఓ దుకాణంలోకి తీసుకెళ్లి, షటర్ వేసి అఘాయిత్యానికి పాల్పడబోయాడు సుమిత్ అనే వ్యక్తి. బాలిక అరుపులు విని స్థానికులు అలర్ట్ అయ్యారు. దీంతో స్థానికులను చూసి సుమిత్ పరారయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. లంగర్‌హౌస్‌లోని అత్తాపూర్‌లో నిందితుడు సుమిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరొకడు ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండాలంటే నిందితుడు సుమిత్‌ని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడు వదిలేస్తే అదే బుద్దితో ఉన్న అతడు ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ కఠినంగా ఉండనంత కాలం ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com