ఆన్‌లైన్‌ మోసాలకు మరో ప్రాణం బలి!

ఆన్‌లైన్‌ మోసాలకు మరో ప్రాణం బలి!
ఆన్‌లైన్‌ మోసాలకు మరో యువకుడు బలయ్యాడు. డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడి మోసపోయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆన్‌లైన్‌ మోసాలకు మరో యువకుడు బలయ్యాడు. డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడి మోసపోయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. మాదకుప్పం గ్రామానికి చెందిన బాలచందర్‌ ఆన్‌లైన్‌ యాప్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు. అతనితో పాటు స్నేహితులు, బంధువులతో కూడా లక్షల్లో ఆన్‌లైన్‌ యాప్‌లో డబ్బులు పెట్టించాడు. అయితే యాప్‌ క్లోజ్‌ అయిపోయి డబ్బులు పోవడంతో బాలచందర్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో ఒత్తిడి తట్టుకోలేక బాలచందర్‌ రైలు కిందపడి అత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story