AP : వివేకా హత్య కేసు... సీబీఐకి సుప్రీంకోర్టు డెడ్‌ లైన్‌

AP : వివేకా హత్య కేసు... సీబీఐకి సుప్రీంకోర్టు డెడ్‌ లైన్‌

వివేకా హత్య కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు డెడ్‌ లైన్‌ పెట్టింది.. కేసులో దర్యాప్తు జరుగుతున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ధర్మాసనం. ఏప్రిల్‌ 30లోపు విచారణ ముగించాలని జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. వివేకా హత్య కేసులో విస్తృత కుట్ర కోణాన్ని.. అత్యంత వేగంగా బయటపెట్టాలని సుప్రీం కోర్టు మార్గనిర్దేశం చేసింది. వేగంగా దర్యాప్తు చేపట్టాలని గతంలో ఇదే కోర్టు ఆదేశించినట్లు గుర్తు చేసింది. అటు.. ఈ కేసులో నిందితుడు శివశంకర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆరు నెలల్లోగా ట్రయల్‌ మొదలు కాకపోతే.. శివశంకర్‌ రెడ్డి డిఫాల్ట్‌ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

అటు ఈ కేసులో కొత్త సిట్‌ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ముందు సీబీఐ ప్రతిపాదన పెట్టింది.. కొత్త సిట్‌లో ఎస్పీ వికాస్‌ సింగ్‌, అడిషనల్‌ ఎస్పీ ముఖేష్‌ కుమార్‌, ఇన్‌స్పెక్టర్లు శ్రీమతి, నవీన్‌ పునియా, ఎస్సై అంకిత్‌ యాదవ్‌ ఉంటారని కోర్టుకు తెలిపింది.. సీబీఐ డీఐజీ కేఆర్‌ చౌరాసియా నేతృత్వంలో సిట్‌ పనిచేస్తుందని దర్యాప్తు సంస్థ ధర్మాసనానికి వివరించింది.. అటు దర్యాప్తు నుంచి ప్రస్తుత అధికారి రాంసింగ్‌ను సీబీఐ తప్పించింది.

Next Story