AP : అనుమతులు లేనిదే రోగులకు వైద్యం

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఎటువంటి అనుమతులు లేకుండా ప్రజలకు వైద్యం చేస్తున్నాడు ఓ డాక్టర్. స్థానిక కోర్టు వీధిలో టీఎన్‌ఆర్ పొలిక్లినిక్ పేరిట అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. సరైన అర్హత, అనుభవం లేకుండా డాక్టర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా చూసీ చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నర్సాపురంలో అనుమతులు లేకుండా ఎవరైనా ఆసుపత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యుటీ dmho ప్రసాద్ హెచ్చరించారు. కోర్టు వీధిలోని పోలిక్లినిక్‌కు తాత్కాలిక అనుమతులు మాత్రమే ఉన్నాయని వాటిని రెన్యువల్ చేసుకోలేదని తెలిపారు. రెన్యువల్ చేసుకోకుండా రోగులకు వైద్యం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. దీనిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని dmho స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com