అప్సరను చంపింది అందుకేనా...!

అప్సరను చంపింది అందుకేనా...!
అప్సర హత్యోదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో అప్సరకు వివాహం జరిగినట్టు గుర్తించారు.

అప్సర హత్యోదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో అప్సరకు వివాహం జరిగినట్టు గుర్తించారు. మొదటి భర్తతో విభేదాల అనంతరం పుట్టింట్లో ఉంటున్న అప్సర… మొదట జాతకం చూపించుకునేందుకు నిందితుడు సాయికృష్ణ వద్దకు వెళ్లింది. ఐతే.. వివిధ రకాల పూజలతో సాయికృష్ణ.. అప్సరకు దగ్గరైంది. ఇదే క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి తెచ్చింది. లేకుంటే ఇద్దరి మధ్య సంబంధం బయట పెడతానని బెదిరించింది. అప్సర బెదిరించడంతో భయపడ్డ సాయికృష్ణ.. ఆమెను చంపేందుకు స్కెచ్ వేశాడు. ఈ నేపథ్యంలో 3వ తేదీ పక్కా ప్లాన్ ప్రకారం అప్సరను హత్య చేశాడు. సాయికృష్ణను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరింత క్లారిటీ వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story