అప్సర హత్య కేసులో మరో ట్విస్ట్.. అసలు ఎవరీ కార్తీక్

పూజారి సాయి కృష్ణ చేతిలో హత్యకు గురైన అప్సర విషంలో... కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఆమెకు పెళ్లైనట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమెను.. చెన్నైకి చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్సర హత్య తర్వాత ఈ మేరకు కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో రిలీజ్ చేసింది. తన కుమారుడిని మానసికంగా వేధించారని, ఆ వేధింపులతోనే తన కుమారుడు కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. పెళ్లైన కొద్దిరోజులకే లగ్జరీగా బతకాలని అప్సర, ఆమె తల్లి అరుణ వేధింపులకి గురి చేశారని వెల్లడించింది. కార్తీక్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టి జైల్లో పెట్టించారని తెలిపింది.
జైలు నుండి బయటకు వచ్చాక కార్తీక్ మానసికంగా కృంగిపోయాడని.. అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. తన కుమారుడి చావుకు అప్సర, తల్లి అరుణనే కారణమన్నారు. ఆ తర్వాత...తల్లి కూతుళ్లు కనిపించలేదని,....అప్సర హత్యకు గురైందని మీడియాలో వార్త చూసి తెలుసుకున్నట్లు తెలిపారు. వీరిద్దరూ హైదరాబాద్‌లో ఉన్నట్టు తమకు తెలీదన్నారు. అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండేదని...అందుకోసమే హైదరాబాద్ వచ్చి ఉంటుందన్నారు ధనలక్ష్మీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com