Assam Rape Case: అత్యాచార నిందితుడు.. భయపడి 'చచ్చాడు'..

అస్సాంలోని నాగావ్ జిల్లాలో గురువారం నాడు 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలియడంతో స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వీధుల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.
ఈ క్రమంలో ప్రధాన నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని చెరువులో దూకి మరణించాడు. శుక్రవారం అరెస్టు చేసిన తఫాజుల్ ఇస్లాంను సీన్ రిక్రియేషన్ కోసం క్రైమ్ స్పాట్‌కు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇస్లాం పోలీసుల అదుపు నుంచి తప్పించుకుని చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. బతికున్నా తాను చేసిన పనికి పోలీసులు, ప్రజలు బతకనివ్వరని అనుకున్నాడో లేక పశ్చాత్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడో తెలియదు కానీ, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన ప్రతి ఒక్కడూ భయపడే రోజు రావాలంటే ప్రజలు రోడ్ల మీదకు రావాలి. పోలీసులు సైతం నిందితుడిని సకాలంలో అరెస్ట్ చేసి విచారించాలి అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఢింగ్ ప్రాంతంలో బాలిక ట్యూషన్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెపై దాడి చేసి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com