Mizoram: రూ.1 కోటి విలువైన సిగరెట్లు పట్టుకున్న అస్సాం రైఫిల్స్

అస్సాం రైఫిల్స్ అధికారులు జరిపిన దాడుల్లో సుమారు రూ.1 కోటి రూపాయల విలువైన 11 కేసుల విదేశీ సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఛంఫాయ్ జిల్లాలోని జోల్తాంగ్‌లో ఈ సిగరెట్లు పట్టుబడ్డాయి. అక్రమ సిగరెట్ల రవాణాపై అధికారులకు సమాచారం రావడంతో అస్సాం రైఫిల్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పర్యవేక్షణలో, కస్టమ్స్ శాఖ సంయుక్తంగా జూన్ 5న ఈ దాడులు నిర్వహించారు. పట్టుబడ్డ సిగరెట్లను సీజ్ చేసి ఛంఫై కస్టమ్స్ ప్రివెంటివ్ అధికారులకు అప్పగించారు.
"జోల్తాంగ్ ఏరియాలో 77 కేసుల్లో నిల్వ ఉంచిన విదేశీ సిగరెట్లను పట్టుకున్నాం. మార్కెట్లో వీటి మొత్తం విలువ 1 కోటి 10వేల దాకా ఉంటుందని" ఈ దాడులపై ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
అస్సాం రైఫిల్స్, ఐజ్వాల్ ఎక్సైజ్, నార్కోటిక్స్, యాంటీ నార్కోటిక్స్ అధికారులు నిర్వహించిన మరో దాడిలో సబ్బు పెట్టెల్లో దాచి ఉంచిన 340గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులో తీసుకున్నారు.. దీని విలువ సుమారు రూ. కోటి 70 లక్షలు ఉంటుందని వెల్లడించారు. పట్టుబడ్డ వారిలో ఒకరు మయన్మార్‌కి చెందిన వారిగా గుర్తించారు.
సుమారు 30 సబ్బు పెట్టెల్లో దాచి ఉంచిన హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నాం. వీటి విలువ సుమారూ. 1 కోటి 70 లక్షలు ఉంటుందన్నారు. పట్టుబడిన హెరాయిన్‌ని ఐజ్వాల్ ఎక్సైజ్, నార్కోటిక్స్, యాంటీ నార్కోటిక్స్ అధికారులకు అప్పగించామని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com