కళ్లలో కారం కొట్టి...వివస్త్రను చేసి... సూర్యాపేట జిల్లాలో దారుణం..!

కళ్లలో కారం కొట్టి...వివస్త్రను చేసి... సూర్యాపేట జిల్లాలో దారుణం..!
సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళను మృతుని కుటుంబ సభ్యులు గ్రామంలో అందరూ చూస్తుండగా వివస్త్రను చేసి కర్రలతో కొట్టారు

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళను మృతుని కుటుంబ సభ్యులు గ్రామంలో అందరూ చూస్తుండగా వివస్త్రను చేసి కర్రలతో కొట్టారు. సూర్యాపేట మండలం రాజునాయక్‌ తండాకు చెందిన శంకర్‌నాయక్‌ జూన్‌ 13న హత్యకు గురయ్యారు. అదే ఊరుకు చెందిన మహిళకు శంకర్‌నాయక్‌ బంధువులతో పాతకక్షలు ఉండటంతో అనుమానంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేయడంతో.. ఆమె జైలు నుంచి విడుదలై తన సోదరి ఇంట్లో తలదాచుకుంటోంది. రాజునాయక్‌ తండాకు చెందిన బంధువు తాజాగా మృతి చెందడంతో.. సదరు మహిళ సొంత గ్రామానికి వెళ్లింది. శంకర్‌నాయక్‌ హత్యానంతరం మొదటిసారిగా తండాకు వచ్చిన ఆమెను చూసి కోపంతో మృతుడి బంధువులు రెచ్చిపోయారు.

మహిళను ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి వివస్త్రను చేశారు. కళ్లల్లో కారం కొట్టి కర్రలతో దాడి చేశారు... అనంతరం నగ్నంగా వీధుల్లో తిప్పారు. నడిరోడ్డులో దాదాపు గంటసేపు ఈ అమానుషం జరిగినా ఏ ఒక్కరూ అడ్డుకోలేదు. చివరికి వారి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ ఎంపీటీసీ ఇంటికి పరుగులు తీయగా.. ఆమెకు ఎంపీటీసీ రక్షణ కల్పించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తండాకు చేరుకుని ఉద్రిక్త పరిస్థితుల నడుమ బాధితురాలిని సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తనపై దాడి చేస్తున్నా గ్రామ పెద్దలు ఎవరూ అడ్డుకోలేదని.. అందరూ చూసి ఊరుకున్నారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింద.ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story